Wednesday, February 5, 2025

డోన్ : నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు

TEJA NEWS TV :
నంద్యాల జిల్లా డోన్ పట్టణం నందు గల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదిన పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ స్కూల్ గ్రూప్ ఆఫ్ కోఆర్డినేటర్ రూప్కోస్,అరేయ్ దుర్గ లక్ష్మి, ప్రిన్సిపాల్ నాగరాజు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామానుజన్ డిసెంబర్ 22 1887 మద్రాసులో శ్రీనివాసన్ అయ్యా కుమలతమ్మ దంపతులకు జన్మించారాని ఆయన గణిత శాస్త్రంలో చేసిన సేవలు గాను ఆయనకు “మాన్ ఆఫ్ ఇన్ఫినిటీ” అనే బిరుదుతో సత్కరించాలని ఈ సందర్భంగా ఆయన జన్మదిన జరుపుకోవడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలలో ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఈరన్న,విజయ్,సుమలత,శివ ,లలిత,మౌనిక,ఏ.వో.మోహన్ గౌడ్,ఎ.డి. రఫీ,వైస్ ప్రిన్సిపాల్ శకుంతల,ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular