TEJA NEWS TV : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నక్కల మెట్ట శ్రీనివాసులు గారి జీవిత చరిత్రపై ముద్రించిన గ్రంథమును డోన్ డీఎస్పీ శ్రీనివాసు రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ భారత దేశంలో బీసీ విద్యార్థులు, బీసీ ప్రజల కొరకు 2008 లో పోరాటాలు చేసి దేశానికి ఆదర్శంగా ఆర్ కృష్ణయ్య తర్వాత శ్రీనివాసులు నిలిచారని జీవితమంతా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కొరకు హక్కుల కొరకు దేశవ్యాప్తంగా పోరాటాలు జరిపి ఎన్నో సంక్షేమ పథకాలు బీసీలకు తీసుకొని వచ్చారని ఆయన చేసిన సేవలు పోరాటాల చరిత్రను ఆయన అభిమానులు మేధావులు అందరూ కలిసి పుస్తక రూపముగా తయారు చేశారని, ఆ పుస్తకాన్ని డోన్ డిఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని ఈ అవకాశాన్నిచ్చిన డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు సంఘసంస్కర్త మహమ్మద్ రఫీ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు హుస్సేన్ పీరా, శ్రీ మల్లికార్జున స్వామి దూదేకుల సిద్ధ వనం లక్ష్మీదేవి, చాముండేశ్వరి, వడ్డే సుజాతమ్మ, మాధవిలత, ధనుంజయ గౌడు తదితరులు పాల్గొన్నారు.
డోన్ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ
RELATED ARTICLES