TEJA NEWS TV DHONE
ప్రతి మూడవ శని వారం జరిగే స్వచ్ఛ ఆంద్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను డోన్ పట్టణం, పాత పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే స్వచ్ఛ ఆంద్ర -స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందువలన మన ఇంటిలో, మన చుట్టుప్రక్కల ఉన్న చెత్త ను మూడు రకాలుగా విభజించి, ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగు డబ్బాలలో తడిచెత్త, పొడిచెత్త, ప్రమాద వస్తువులతో కూడిన చెత్తలను వేరుచేసి, మునిసిపాలిటీ వారి చెత్తబండిలో వేయాలని తెల్పడమైనది. ఈకార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, వెంకటరమణ, బాబు, సుబాన్, వెంకట లక్ష్మీ, లక్ష్మీ కాంత రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుబ్బారాయుడు, సురేష్, రాధ, అల్లిపీరా, రఘునాథ్, ఎస్తేరమ్మ, జయసుబ్బరాయుడు , శివన్న, ఆదినారాయణ, రమేష్, దేవేంద్రప్ప, భాను ప్రకాష్ రెడ్డి,భారతి, లక్ష్మీ ప్రభావతి, హుస్సేన్ భాను, ప్రసాద్ రావు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు స్వచ్ఛ ఆంద్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం
RELATED ARTICLES