![](https://tejanewstv.com/wp-content/uploads/2024/12/img_20241230_192301_7391736284310888136574-1024x461.jpg)
TEJA NEWS TV
*ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారత దేశ ఆర్థికరూపశిల్పి డాక్టర్ మన్ మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటు*
*సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం, తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ శ్రీ మన్మోహన్ సింగ్ గారి దే*
*దేశ ప్రధానిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా,అయన అందించిన సేవలు మరువలేనివి*
*డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది*
*అయన సేవలను కొనియాడిన కాంగ్రెస్ పార్టీ డోన్ అసెంబ్లీ సమన్వయ కర్త డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి మరియు నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్*
*సంతాప సమావేశానికి హాజరై నివాళులు అర్పించిన కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు పి జీవన్ బాబు, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నాయకులు అనిల్,వెంకటేష్, భార్గవ్,మరియు మహాజన విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివన్న, ఆర్ ఎస్ ఎఫ్ రాష్ట్ర నాయకులు చిరంజీవి*
పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వై ఎస్ షర్మిల రెడ్డి గారు, నంద్యాల జిల్లా అధ్యక్షులు జె. లక్ష్మి నరసింహ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు డోన్ పట్టణములో స్థానిక ప్రతిభ కోచింగ్ సెంటర్ లో డోన్ నియోజకవర్గ సమన్వయ కర్త ఇంచార్జి డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి ఆధ్వర్యంలో దేశ ఆర్థిక సంస్కరణ ల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభను నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ
ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారత దేశ ఆర్థికరూపశిల్పి డాక్టర్ మన్ మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటు అని దేశ ప్రధానిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా,అయన అందించిన సేవలు మరువలేనివని,ఈయన సారథ్యంలో భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని,
ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిదని,వారి సేవలను కొనియాడాడం జరిగింది.సమాచార హక్కు చట్టం మన దేశ పౌరుల హక్కులను కాపాడితే, ఉపాధి హామీ పథకం నిరుపేదల జీవితాలకు మార్గదర్శి అయ్యింది, పేదలు ఎవరు కూడా ఆహరం లేక ఇబ్బంది పడకుండా ఉండాలని ఆహార భద్రత చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిదని,
ఆ మహనీయుడి సంస్కరణలు, సాధించిన విజయాలు మన దేశ ప్రతి పౌరుడికి ఆదర్శం. అని వారు గుర్తు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్, లీగల్ సెల్ అధ్యక్షులు పి జీవన్ బాబు, డోన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వై శేఖర్,డోన్ మండల అధ్యక్షులు వడ్డె రాజశేఖర్ ప్యాపిలి మండల అధ్యక్షులు శనగల మహేంద్ర నాయుడు, డోన్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రహీం బాషా,డిసిసి సహాయ కార్యదర్శి ఆర్ మల్లికార్జున, ప్యాపిలి మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు, ఖాజా, డోన్ పట్టణ అధ్యక్షులు శ్రీ హనుమాన్, మండల ఉపాధ్యక్షులు పి సురేష్, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు శివన్న, ఆర్ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు చిరంజీవి, మరియు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు,వెంకటేష్, అనిల్, విశ్వం,ఉపేంద్ర, అంజి, మనోజ్, వినీత్, భార్గవ్,ఆనంద్, ఫయాజ్ ,చరణ్