TEJA NEWS TV
అనంతపురం జిల్లా రాప్తాడు లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలో ఏబీఎన్ విలేకరిపై చేసిన దాడిని ఒక సంఘంలో వ్యక్తిగా గతంలో మాజీ మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఆ ఘటనను ఖండించేది పోయి విలేఖరి కాబట్టి వదిలేశారని యజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నట్లయితే పరిస్థితి ఇంకా వేరేగా ఉండేదని సంబోధించడం ఇది సరైన పద్ధతి కాదంటూ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఏపీ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు వడ్డే నాగరాజు, మీడియా సలహాదారులు శివరామయ్య ఆచారి,డోన్ సహాయ కార్యదర్శి నంద్యాల జిల్లా ఏపీ మీడియా ఫెడరేషన్ సహయకార్యధర్శి జిలాని లు ఖండించారు.వారు మాట్లాడుతూ మీడియా రంగం అనేది ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటూ నిత్యం ఎక్కడ ఏ సమస్య జరిగిన ప్రజలు ఆధికారుల దృష్టికి తీసుకువెళ్ళే వారని ఆలాంటి వారిపై దాడి చేయాడాన్ని ఖండించేది పోయి ప్రోత్సహించడం సబాబు కాదని ఆయన చేసిన వాక్యాలను మాజీ మంత్రి కొడాలి నాని తక్షణం వెనుకకు తీసుకోవాలని లేని పక్షంలో ఏపీ మీడియా ఫెడరేషన్ తరఫున నిరశన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ మీడియా ఫెడరేషన్ సభ్యులు శివానందం,విక్రమ్,నవీన్, మహమ్మద్,ప్రసాద్,మద్దిలేటి,కాశిం, ఇతర మెంబర్లు పాల్గొన్నారు.
డోన్:మాజి మంత్రి కోడాలి నాని విలేకరులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏపీ మీడియా ఫెడరేషన్ యునియన్
RELATED ARTICLES