ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని,పార్టీ చేరికల మీద ఉన్న దృష్టి ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం సంగెం మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండ, నార్లవాయి, ముమ్మిడివరం, మొండ్రాయి,గొల్లపల్లి, పల్లారుగూడ,వి.ఆర్.ఎన్ తండ,పోచమ్మతండ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డిమాట్లాడుతూ.
పార్టీ చేరికల మీద ఉన్న శ్రద్ధప్రజల సమస్యల మీద కాంగ్రెస్ కు లేదు
డిసెంబర్ 9 పోయి 4 నెలలు అయింది..ఇచ్చిన హామీలు ఏమైనయ్ సిఎం .రైతులకు నట్టేట ముంచి,కష్టాలపాలు చేసినచరిత్రకాంగ్రెస్ ప్రభుత్వానిది.రెండు లక్షల రుణమాఫీఎటుపోయింది..మహిళలకుఇస్తానన్న 2500 ఎక్కడాపోయినవి..తులం బంగారంఏటుపోయింది.కాంగ్రెస్ మోసాలను ప్రజలకువివరించాలనికార్యకర్తలకుపిలుపు
కాంగ్రెస్ పాలనకు..బిఆర్ఎస్ పాలనకు తేడా ఏంటో ప్రతి కార్యకర్త భాద్యతగా ప్రజలకు వివరించాలి.గత ఎన్నికల్లో జరిగినతప్పిదాలను కార్యకర్తలుగ్రహించి ఈ ఎన్నికల్లోముందుకెళ్లాలి.
ప్రతి కార్యకర్త భాద్యతగా గడపగడపకు వెళ్లి కారు గుర్తుకుఓటువేయాలని ప్రజలనుఅడగాలన్నారు.
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది.కేసీఆర్ పాలనే బాగుండేదనిగ్రామాలలో చర్చజరుగుతున్నది.
ఇచ్చిన హామీల నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు.
పార్టీలో ఉండి ఉన్నతమైన పదవులు అనుభవించి కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు విశ్వసించారు.వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లోకార్యకర్తల కృషితో బిఆర్ఎస్అభ్యర్థి డా.మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు ఖాయం.పరకాల నుండి భారీమెజార్టీ ఇవ్వడం ఖాయం.ఈ సమావేశాల్లో రెడ్ క్రాస్ చైర్మన్,జిల్లా నాయకులనిమ్మగడ్డ వేంకటేశ్వరరావు,మండల పార్టీఅధ్యక్షులుపసునూరి సారంగపాణి,జడ్పీటిసి గూడ సుదర్శన్ రెడ్డి,వైస్ఎంపిపిబుక్క మల్లయ్య,మండల కోఆప్షన్ మన్సూర్అలీ,నాయకులు పులుగుసాగర్ రెడ్డి, జక్కమల్లయ్య,పూజారి గోవర్ధన్,సుతారి బాలకృష్ణ, ఉండీలారాజు,కక్కర్ల సదానందం,ఎంపిటిసిలు,మాజీ సర్పంచులు,నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్, మారేపల్లి సుధీర్ కుమార్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలి -మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
RELATED ARTICLES