TEJA NEWS TV
డీఐజీ కర్నూల్ గారి సూచనలు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధి రాజ్ సింగ్ రానా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీ ప్రమోద్ కుమార్ నేతృత్వంలో ఆళ్లగడ్డ సబ్-డివిజన్ లోని శిరివెళ్ల మరియు ఆళ్లగడ్డ పట్టణ పరిధిలో సమగ్ర ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు హెల్మెట్ ప్రాముఖ్యత, రహదారులు దాటి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే జాతీయ రహదారి NH-40 లోకి ప్రవేశించే సమయంలో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించబడింది. గ్రామీణ ప్రయాణీకులకు రోడ్డు భద్రత నిబంధనలపై స్పష్టతనిచ్చారు.
తల్లిదండ్రులకు తమ పిల్లలను అధికంగా లోడ్ అయిన ఆటోలలో పాఠశాలలకు పంపకూడదని కౌన్సిలింగ్ ఇవ్వబడింది. ఆటో డ్రైవర్లను సరైన డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రయాణికుల అధిక లోడ్‌తో ఆటోలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించబడుతుంది మరియు జరిమానాలు విధించబడతాయి.


