TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నూల్ పల్లి గ్రామంలో ఐ ఐ ఎల్ కంపెనీ నూతనంగా ఉత్పాదన అయిన టోరి సూపర్ మందు ను మెదక్ సేల్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి రైతుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ మొక్కజొన్నలో ప్రధాన సమస్యగా ఉన్న గడ్డి జాతి మొక్కలను టోరి సూపర్ మందు ఇతర మందుల కంటే సమర్థవంతంగా నివారిస్తుందని, ఈ మందు పిచికారి చేసిన మూడు రోజుల నుండి కలుపు మొక్కలపై ప్రభావం చూపుతోందని అన్నారు,ఈ మందును నీటిలో మిశ్రమం చేయడం సులభతరమని, ఎకరానికి 600 గ్రాములు మోతాదు వాడవలెను అని సూచించారు. మొక్కజొన్న వేసిన రైతులు కలుపు మొక్కల నివారణకు టోరి సూపర్ ని ఉపయోగించి అధిక దిగుబడులు పొందాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మధుసూదన్ రెడ్డి, కొమురయ్య, నర్సింలు ,ఎల్లం డీలర్ శ్రీకాంత్, మల్లికార్జున అగ్రో కెమికల్స్ ఫీల్డ్ స్టాప్ మధు, తదితరులు పాల్గొన్నారు.
టోరి సూపర్ మందు పై రైతులకు అవగాహన కలిపించన మెదక్ సేల్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి
RELATED ARTICLES