వరదయ్యపాలెం ఏప్రిల్ 27 (తేజ న్యూస్ టీవీ )
బెంగళూరులో ఏషియ ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీచే సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం కు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పవన్ కుమార్ కు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు బెంగళూరులో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు.సమాజంలో పేదల పట్ల ఆయనకు ఉన్న జాలి_ కరుణ… తో ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలు పరిగణంలోకి తీసుకొని గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు తెలిపిన నిర్వాహకులు…
ఏది ఏమైనా
కరోనా సమయంలో ప్రజలకు ఆయన అందించిన సేవలకు గాను, మరియు తమిళనాడు రాష్ట్రంలో యూనివర్సిటీలో చదివే తప్పనుండి విద్యార్థి దశలోనే ఆయనకు ఉన్న సేవా గుణం…
పరిగణంలో తీసుకున్న సంస్థ కరోనా సమయంలో ఆయన సేవలను బాధ్యత కుటుంబాల ద్వారా తెలుసుకొని గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం గమనార్హం.మనలో ఒకడిగా ఉంటూ సాదాసీదాగా ఉంటూ ఎవరికి తెలియని విధంగా ఈ స్థాయిలో సేవలు చేసి పవన్ కుమార్ గౌరవ డాక్టరేట్ పొందడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు…..
సేవలలో పబ్లిసిటీ కోరుకునే వాడు సేవకుడు అవ్వడు… అది నీటి బుడగ లాంటిది…
నిజమైన సేవ ప్రచారాన్ని కోరుకోదు….మనస్ఫూర్తిగా పేదల పట్ల జాలి కరుణ చూపించే సేవే ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది….
టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పవన్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం
RELATED ARTICLES