Wednesday, January 22, 2025

టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేన మద్దతు



జగ్గయ్యపేట, ఉమ్మడి కృష్ణా జిల్లా

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ,శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ,ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సామూహిక నిరసన దీక్షకు జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ పూర్తి మద్దతు తో పాటుగా సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు ,శ్రీ బొలియశెట్టి శ్రీకాంత్ , పాల్గొని వారు మాట్లాడుతూ జనసేన టీడీపీ కలయిక ఈ రాష్ట్ర ప్రజల కోసం అని ఎవరి వ్యక్తి గత స్వలాబాల కోసం కాదు అని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈరోజు ఈ దీక్ష శిబిరం నందు పాల్గొనటం జరిగింది అని, కలిసిగట్టుగా పని చేస్తే రాబోయే రోజుల్లో మనదే అధికారం అని, ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద ఆయన గట్టిగా స్పందించారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, నియోజకవర్గ నాయకులు షేక్ షౌకత్ అలీ, చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మోసిన్ అహ్మద్, జగ్గయ్యపేట మండల అధ్యక్షులు తులసి బ్రహ్మం, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు తునికపాటి శివ, వీరమహిళ శైలజ గారు, జనసైనికులు త్రిశాంత్, గోపి, రాం ప్రసాద్, నాగ, హరీష్, అజయ్, సుమంత్, శ్రీను, రామ కోటయ్య, మీరా, మల్లికార్జున్, గోపి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తాం అని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని కలిసిగట్టుగా పని చేసి జనసేన టీడీపీ జండా ఎగిరే విధంగా కలిసి పని చేసి ప్రజలకు సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అని తెలియచేసారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular