ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో టీడీపీలో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నందిగామ నియోజకవర్గంలో తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆ క్రమంలో శ్రేణులను సమన్వయపరచుకుంటూ వస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తరువాత మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడంలో ఆమె చేసిన సూచనలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.
తాజాగా కంచికచర్ల మండలం కీసరలో వలసల పరంపర ప్రారంభమైంది. అధికార పార్టీ నుండి మునగా శ్రీనివాసరావు, చలమల నాగేశ్వరావు, చలమల పిచ్చయ్య, రామిశెట్టి వెంకటేశ్వరరావు, రామిరెడ్డి నరసింహారావు, రామిరెడ్డి రోశయ్య, రామిరెడ్డి పెద్ద నరసింహారావు, రామిరెడ్డి రామకృష్ణ, రామిరెడ్డి గురునాథం, విరిసెట్టి మదన్, బిగుమళ్ళ శ్రీనివాసరావు, ఆకుల గోపి, రామిరెడ్డి మల్లికార్జునరావు, బెల్లంకొండ విజయ్, మునగ సురేష్, మునగ గణేష్, రామిరెడ్డి గోపి, కొట్రా గోవింద్, రామిరెడ్డి గురునాధం, ప్రత్తిపాటి చిరంజీవి, కొంగల శ్యామ్ తదితరులు ఆ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.
నందిగామ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య గ్రామ, మండల పార్టీ నేతల ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
టీడీపీలోకి జోరుగా వలసలు
RELATED ARTICLES