Wednesday, February 5, 2025

టీం పవన్ ఆర్మీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో క్లాత్ మర్చంట్ సొసైటీ హాల్ నందు టీం పవన్ ఆర్మీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి మరియు జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను గారు మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో నేడు ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నేడు ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరిగి సరైన సమయానికి రక్తమందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలుగా నిలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చి నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను పాల్గొంటున్న మొదటి కార్యక్రమం ఈ రక్తదాన కార్యక్రమం. ఈమధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య డ్యాం బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదని తెలుసుకొని వారికి ఇచ్చిన మాట కోసం తన సొంత డబ్బులు 60 లక్షల రూపాయలు వెచ్చించి ఒక స్థలం వారికి బహుమతిగా ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వారి సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధికి మేమంతా కలిసి పనిచేయాలని ఉమ్మడి కృష్ణాజిల్లా లో పార్టీ బలోపేతానికి నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని అన్నారు. తదనంతరం తంబళ్లపల్లి రమాదేవి గారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం ప్రతి సంవత్సరం రక్తదాన కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు అకాల వర్షాలు, వరదల వల్ల ఈ రక్తదాన కార్యక్రమం పోస్ట్ పోన్ అయ్యి నేడు జరుపుకుంటున్నాము. టీం పవన్ ఆర్మీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుండి తల సేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ రక్తం చేరే విధంగా వీరు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు మరియు జనసైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తున్నారు. సేవా తత్పరత కలిగినటువంటి గొప్ప నాయకులు జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలను జరుపుతూ ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా టీం పవన్ ఆర్మీ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రక్తాన్ని దానంగా ఇచ్చిన రక్తదాతలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు టీం పవన్ ఆర్మీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular