Wednesday, January 22, 2025

టిడిపి జనసేన సమన్వయ సమావేశం

TEJA NEWS TV: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి అన్న వార్తతో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు వ్యూహరచనలతో బిజీ అయిపోయారు. జనసేన తెలుగుదేశం పార్టీలు పోటీ చేస్తాయనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరుపార్టీల ముఖ్య నేతలు ఇదివరకే ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించి ఎన్నికలకు వెళ్లే విషయాలపై చర్చలు జరిపిన విషయము తెలిసినది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ అంతర్గత ఆలోచనలను ప్రజల వైపు తీసుకునే వీళ్ళే ఉద్దేశంతో ఈరోజు కర్నూల్ లో నిర్వహించిన జనసేన టిడిపి ఆత్మీయ సమ్మేళన సమావేశం కు ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన టిడిపి కోఆర్డినేటర్ అయినటువంటి చింత సురేష్ బాబు గారి ఆహ్వానం మేరకు మంత్రాలయం నియోజవర్గం డి.బెడగల్ గ్రామ జనసేన నాయకులు పొంత నరసింహులు మరియు మండలం లో నీ జనసైనికులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన టిడిపి ఉమ్మడి పోరాటాలు చేసి వైసిపి ప్రభుత్వం గద్దించాలని పిలుపునివ్వడం జరిగింది మరియు త్వరలో జరగబోయే ఉమ్మడి కార్యచరణలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular