ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం మాగల్లు గ్రామంలో కేకే వృద్ధాశ్రమంలో ఎన్టీఆర్ గారి 101వజయంతి జయంతి వేడుకలు టిడిపి గౌస్ సౌజన్యంతో వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. గౌస్ కుటుంబ సభ్యులు, మిత్రులు ఎన్టీఆర్ గారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి… రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి… వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు… యుగపురుషుడు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని తెలిపారు.*
టిడిపి గౌస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
RELATED ARTICLES