తేజ న్యూస్ టివి
ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితి వదలొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ శుక్రవారం రోజు టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని తొలి సారిగా సందర్శించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయమునకు చేరుకున్న సీపీకి
టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సీపీ మొదటగా టాస్క్ ఫోర్స్ కార్యాలయం పరిసరాలను పరిశీలించిన అనంతరం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి వరకు ఎలాంటి నేరగాళ్ళను పట్టుకున్నారు మొదలైన వివరాలను పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు అంటే ప్రజలకు నమ్మకం ఉండేలా చూడాలని, చట్టావ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల సమాచారం కోసం బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ను ఏర్పాటు చేసుకుని అలాగే క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించాలని, టాస్క్ ఫోర్స్ లో క్వాలిటీ వర్క్ కావాలని, నేరానికి సంబందించి మూలలకు వెళ్ళి నేరస్తులను పట్టుకోవాలని,తప్పుడు చర్యలకు పాల్పడితే టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడుతామని నేరస్థులకు భయం కలిగిస్తూనే ప్రజలకు టాస్క్ ఫోర్స్ పోలీసులపై నమ్మకం, గౌరవాన్ని పెంపోందించాలని, అలాగే టాస్క్ ఫోర్స్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించవద్దని అలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
టాస్క్ ఫోర్స్ వరంగల్ పోలీస్ కార్యాలయంను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ IPS
RELATED ARTICLES