Monday, January 20, 2025

జోరుగా బిజెపి సభ్యత్యాలు నమోదు చేయాలి

*జోరుగా బిజెపి సభ్యత్యాలు నమోదు చేయాలి*

  *మక్తల్ నియోజకవర్గంలో 50వేల పైచిలుకు లక్ష్యం*


  *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి*

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం స్థానిక వర్తక సంఘ భవనంలో ఆత్మకూరు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఇట్టి సమావేశ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గం లో 50 వేల పైగా పైచిలుకలు బిజెపి సభ్యత్వ నమోదు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని స్థానిక ఎలక్షన్ లో గెలుపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటింటికి చేరే వేసే విధంగా కార్యకర్తలు పని చేయాలని.భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి కృషి వలన తెలంగాణ వరదల సహాయంకు 1300 వందల కోట్లు రాష్ట్రానికి అడ్వాన్స్ గా విపత్తు నిర్వహణకు కేంద్ర నిధులు కేటాయించిన సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో నారాయణపేట జిల్లా సభ్యత్వ కన్వీనర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి,ఆత్మకూర్ టౌన్ సభ్యత్వ ఇన్చార్జి కనకరాజు,కన్వీనర్ పట్టణ సభ్యత్వ ఇంచార్జ్ కన్వీనర్ తంబలి విజయ్,కో కన్వీనర్ లో లక్ష్మీనారాయణ,మండ్ల సూరి, ఆత్మకూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్,వనపర్తి జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బోరెల్లి రాము,నాయకులు అనిల్ కుమార్ గౌడ్,బాలు,రాము,ఆనంద్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular