భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ | 12.02.2025
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమం సన్నాహక సమావేశం చండ్రుగొండ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు దారం గోవింద్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అభియాన్ మండల ఇంచార్జ్ వీరాపురం రామ్ లక్ష్మణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ —
“ఈ అభియాన్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటం నుంచి దేశాభివృద్ధిలో చేసిన సేవలను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఎలా అవమానిస్తోంది, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తోంది అనేది ప్రజలకు తెలియజేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ఈ అభియాన్‌లో చురుగ్గా పాల్గొనాలి” అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దారం గోవింద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్, కిసాన్ సెల్, మైనారిటీ సెల్, NSUI, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బడుగు వెంకటేష్ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం
RELATED ARTICLES



