Saturday, December 13, 2025

జై బాపు జై భీమ్ జై సంవిధన్ పాదయాత్ర ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TEJA NEWS TV


చేగుంట పట్టణ కేంద్రం లో  ఏఐసీసీ,  టీపీసీసీ పిలుపుమేరకు,జై బాపు,జై భీమ్.జై సంవిధాన్,పాదయాత్ర ముగింపు  కార్యక్రమంలో అధిష్టానం నియమించిన  కోఆర్డినేటర్లు  జనగామ మల్లారెడ్డి.మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చెపట్టిన
పాదయాత్ర  కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు,ఈ సందర్భంగా  చెరుకు శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ
చేగుంట పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు, దేశం లో
మహాత్మ గాంధీ వారసత్వాన్ని ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరచడం అంటే యావత్  దేశ ప్రజలను అవమానపరిచినట్లే  అని అన్నారు,బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాసౌమ్య,విలువలను కాలరాస్తూ,రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు, దేశం లో బిజెపి అసమర్ధ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు  చేగుంట పట్టణంలో పర్యటించి జై బాపు. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు..
ఇట్టి కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు.నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular