ఐదు సంవత్సరాల పదవి కాలం ముగిసిన గీసుగొండ,సంగెం మండలాలకు చెందిన జెడ్పిటిసిలు,ఎంపీటీసీలకు గురువారం రోజు పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని వారి నివాసంలో సన్మానించారు.గత ఐదు సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ,ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తూ, అన్ని గ్రామాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తూ, నిస్వార్ధంగా సేవలు అందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు.పదవులు శాశ్వతం కాదని,పదవి ఉన్న లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషిచేయాలని కోరారు.కోట్లాది సాధించుకున్న తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో,బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత పది సంవత్సరాల కాలంలో గ్రామాలు ఎనలేని అభివృద్ధి చెందాయని అందులో భాగస్వామ్యం కావడం ప్రజాప్రతినిధుల అదృష్టం అన్నారు.రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గీసుగొండ,సంగెం మండలాల జెడ్పిటిసిలు,ఎంపిటిసిలు,కో ఆప్షన్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పిటిసి,ఎంపీటీసీలను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
RELATED ARTICLES