
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
జూలూరుపాడు మండలం
20-2-2025
జూలూరుపాడు: విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటాలని, టాలెంట్ టెస్ట్‌ల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని ఏసిపి సబ్బతి విష్ణుమూర్తి అన్నారు. జూలూరుపాడు మండలంలోని ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ పేపర్ ను ఏసిపి విష్ణుమూర్తి, సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ అధ్యక్షతన సమావేశం జరిగింది. AISF విద్యార్థి సంక్షేమం కోసం పనిచేస్తోందని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి సంఘం ఇదేనని ఏసిపి తెలిపారు.
సిపిఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, టాలెంట్ టెస్ట్‌ల ద్వారా విద్యార్థులు భయాన్ని అధిగమించి సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. AISF జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రం విద్యార్థుల సిలబస్ ఆధారంగా రూపొందించామని, ఇది 100 మార్కుల పరీక్ష అని తెలిపారు.
ఈ పరీక్షలో మండలవ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాయి ఎక్సెలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఆరబోయిన కృష్ణ ప్రసాద్, హైస్కూల్ హెచ్‌ఎం లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు రాంశెట్టి శ్రీనివాసరావు, AISF, AIYF నాయకులు తదితరులు పాల్గొన్నారు.