TEJA NEWS TV
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో జూరాల గ్రామంలో క్రిష్ణ నది పరీవాహక ప్రాంతాల్లో జూరాల ప్రాజెక్టు కింద పలు గ్రామాల్లో పర్యటించిన, నది ప్రవాహాన్ని పర్యవేక్షించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఆయన అధికారులు అందరికీ కూడా పలు సూచనలు చెప్పడం జరిగింది. అలాగే మత్స్యకారులు గొర్రెల కాపర్లు పశువుల మేతకు వెళ్లే వాళ్ళు ఎవరు కూడా కృష్ణ నది వైపు రాకూడదు. అని ఆయన పలు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. చెరువులు, కుంటలు, బావులు, పుష్కలంగా కలకలాడుతున్నాయి కనుక ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా పంటలు పండించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరమేష్, మరియు మాజీ మండల అధ్యక్షులు రహమతుల్లా సీనియర్ నాయకులు మొగిలి గంగాధర్ గౌడ్ పిన్నంచర్ల మాజీ సర్పంచ్ మచ్చేందర్ గౌడ్, జూరాల మాజీ సర్పంచ్ మహమూద్, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది
జూరాల వరద నీటిని పరిశీలిస్తు మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి
RELATED ARTICLES