Friday, December 12, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలవడం పట్ల లక్ష్మిదేవిపల్లి మండలంలో ఘనంగా సంబరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
లక్ష్మీదేవి పల్లి
14-11-2025



✨ లక్ష్మిదేవిపల్లిలో నవీన్ యాదవ్ గెలుపు సంబరాలు ✨

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలవడం పట్ల లక్ష్మిదేవిపల్లి మండలంలో ఘనంగా సంబరాలు జరిపారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి మాట్లాడుతూ

> “జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు. కేటీఆర్ జిమ్మిక్కులు, బిఆర్ఎస్‌ డబ్బుల రాజకీయాలు, సోషల్ మీడియాలో చేసిన విష ప్రచారం ఏవి కూడా ప్రజలు నమ్మలేదు. రౌండ్ రౌండ్‌కు పెరిగిన ఆధిక్యం — సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం” అని అన్నారు.



అలాగే,
“జూబ్లీహిల్స్ గెలుపు నాంది… రాబోయే స్థానిక ఎన్నికల్లో మరింత సత్తా చాటతాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.” అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు:
పెదబాబు, PACS అధ్యక్షుడు మండే హనుమంతరావు, ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్, పూణెం శ్రీనివాస్, మైనార్టీ జిల్లా కార్యదర్శి MD. గౌస్ భాయ్, మాజీ సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు, లాలు, తాటి తిరుమలేష్, రావు మధు, కొంపెళ్లి వీరయ్య, ఉబ్బనీ రాజు, వజ్జ చందు, అంతడపుల కృష్ణ, ఐకి సత్యనారాయణ, కుంజ సూరిబాబు, MD. అయబ్ భాయ్, కాంపెల్లి నరేష్, వంశీ, బ్యాండ్ రమణ, సుందర్ లాల్ కోరి, మాజీ ఉపసర్పంచ్ మహేష్, శివ, మాతిన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular