భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ నులు పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా వచ్చిన అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వైద్య శాఖ సిబ్బందితో కలిసి మొక్కల నాటిన అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు నులిపురుగులను నివారించేందుకు గవర్నమెంట్ ద్వారా ఉచితంగా అందిస్తున్న మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
RELATED ARTICLES