నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రం లోని ప్రాంతీయ పశువైద్యశాల ఆవరణలో జాతీయ జెండాను అవమానించే విధంగా జాతీయ జెండాను ఎగుర వేయకుండా అలాగే షెడ్డు కు కట్టివేశారు. జాతీయ జెండాను ఎవరైనా జాతీయ నాయకులు మృతి చెందిన సందర్భాలలో లేదా ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో ఎగురవేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా రుద్రవరంలోని ప్రాంతీయ పశు వైద్యశాల ఆవరణలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో జాతీయ జెండాను అవమానించే విధంగా అధికారులు ఎగురవేయకుండా షెడ్డు కు అలాగే కట్టి ఉంచడంతో జాతీయ జెండా రెపరెపలాడకుండా అలాగే కిందికి ఉండడంతో పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించే అధికారులు జాతీయ జెండాను అవమానించే విధంగా ఇలా కట్టివేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు ఇటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.