TEJA NEWS TV
దోమకొండ. జాగ్రత్తలతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుందని వై ఆర్ జి కేర్ లింకు వర్కర్ స్కీం డి ఆర్ పి సుధాకర్ తెలిపారు. గురువారం దోమకొండలో గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ స్వచ్చంద సంస్థ ద్వారా దోమకొండ గ్రామంలో అందించిన సేవలను వివరించారు. హెచ్ఐవి, టిబి, సుఖ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు దోమకొండ గ్రామపంచాయతీ సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ పెద్దల సహకారంతో గ్రామంలో కండోమ్ బాక్స్ ల ఏర్పాటు, వాల్ పెయింటింగ్, హెచ్ఐవి హెచ్ఐవి బాధితులైన పలువురికి నిత్యవసర వస్తువులను సైతం అందజేశామన్నారు.
లింకు వర్కర్ బాలకిషన్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
దోమకొండ లింక్ వర్కర్ బాలకిషన్ పై పలు పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై డి ఆర్ పి సుధాకర్, ఐ సి టి సి కౌన్సిలర్ నాగరాజు గ్రామ పెద్దలను విచారించారు. వ్యక్తిగతంగా గిట్టని వారు కొందరు తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు చేశారని గ్రామ పెద్దలు తెలిపారు. హెచ్ఐవి బాధితుల సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారని, కండోమ్ లు అమ్ముకుంటున్నాడని, సేవలు అందించటం లేదన్న తప్పుడు ఆరోపణలను వారు ఖండించారు. లింక్ వర్కర్ గ్రామంలో చేస్తున్న పనితీరు బాగుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ లింకు వర్కర్ బాలకిషన్ కు పూర్తి మద్దతిస్తామని, హెచ్ఐవి నివారణలో తాము భాగస్వాములమైతామని రామ పెద్దలు తెలిపారు. విచారణలో తేలిన అంశాలతో ఉన్నతాధికారులకు తాము నివేదికని అందిస్తామని డి ఆర్ పి సుధాకర్, ఐసిటిసి కౌన్సిలర్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కానుగంటి శారద నాగరాజ్, జెడ్పిటిసి తిరుమల్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నర్సారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, మాజీ సి డి సి చైర్మన్ ఐరన్ నరసయ్య, మాజీ ఎంపీటీసీలు నల్లపు శ్రీనివాస్, నాగరాజు రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్, రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షుడు బుర్రి రవికుమార్, నాయకులు అండెం శంకర్ రెడ్డి, బొమ్మెర శ్రీనివాస్, చింతల రాజేష్, భూపాల్ లక్ష్మణ్, రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గోపాల్ రెడ్డి, ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు బంకు శ్రీనివాస్, బాపురెడ్డి, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తలతోనే హెచ్ఐవి నివారణ
RELATED ARTICLES