Saturday, January 17, 2026

జర్నలిస్టులపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం..
– కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూగులోత్ బలరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ

జర్నలిస్టులపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం..
– కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూగులోత్ బలరాం నాయక్
– ప్రజా సమస్యలను ప్రచురిస్తే భౌతిక దాడులకు దిగుతారా
– జర్నలిస్టుపై అసత్య ప్రచారం చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి

చండ్రుగొండ ఆగష్టు 30

జర్నలిస్టులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్న జర్నలిస్టుల కృషిని అభినందించాల్సింది పోయి, విలేకరులపై వ్యక్తిగత దాడులకు పూనుకోవడం తోపాటు, అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో పెట్టి జర్నలిస్టుల వ్యక్తిగత ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం పట్ల చండ్రుగొండ కలం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుగులోత్ బలరాం నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో కలం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ… రెండు రోజుల క్రితం తిప్పనపల్లి గ్రామంలో మహిళలు ఇందిరమ్మ ఇల్లు తమకు ఇవ్వడం లేదని డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తారా అని బహిరంగంగా వారు మాట్లాడిన విషయాలను పత్రిక ముఖంగా మీడియా లో ప్రచురణ చేసి బాధితులకు అండగా ఉన్నందుకు అదే గ్రామంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణకు దిగడంతో పాటు పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా ఉందని. ఇలాంటి వారిపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇలాంటి నాయకుల వల్ల  ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి చెడ్డపేరు రావడమే కాకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభావం పడుతుందన్నారు. ఒక జర్నలిస్టుపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు పరువుకు భంగం కలిగించినందుకు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని అన్ని మండలాలకు వ్యాప్తి చేయడంతో పాటు, జిల్లా రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ సంఘాలను ఏకంచేసి కాంగ్రెస్ నాయకులు తీరును ఎండగడతామని అన్నారు. జర్నలిస్టులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటున్నారు. అలాంటి జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ప్రభుత్వ పథకాలను పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రచారం చేసినప్పుడు జబ్బాలు కొట్టుకునే నాయకులు ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడు వ్యక్తిగత దాడులకు దిగటం ఎంతవరకు కరెక్టు.. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో కలం ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular