జర్నలిస్టులకు ఎలాంటి రుసుము లేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర ప్రభుత్వాన్ని కోరారు.
కొత్తగూడెం గంగాబిషన్ బస్తీలో గతంలో జర్నలిస్టులకు కేటాయించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిపై జరుగుతున్న నిరసన శిబిరాన్ని ఆయన సందర్శించి, వారికి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఒక్క ఎకరానికి ₹2.50 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేయాలనే నిబంధనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉచిత భూమి పంపిణీ చేయాలనే హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే జర్నలిస్టుల హక్కుల కోసం ఆదివాసి ఐకాస పోరాటం చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, జిల్లా నాయకులు తాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఉచితంగా ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఆదివాసి ఐకాస డిమాండ్
RELATED ARTICLES