TEJA NEWS TV
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల 10బొల్లారం గ్రామానికి
చెందిన క్రియాశీల సభ్యుడు విద్య పోగు సుంకన్న రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందినందు న ఆయన కుటుంబానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కు సోమవారం, మంగళగిరిలో అందించడం జరిగింది. ఈ సందర్భం గా జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా చింత సురేష్ బాబు మరియు జనసేన పార్టీ సమన్వయ బాధ్యులు నల్లమల రవికుమార్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అంటే నమ్మకం- నమ్మకం అంటే జనసేన పార్టీ అని జనసేన పార్టీ అధినేత అనుక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజా శ్రేయస్సు కొరకు ఆలోచిస్తూ ఆ బాటలోనే ఆయన జీవితాన్ని గడుపుతుంటాడని, అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చేపట్టినారని తెలియజేశారు. ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనిషి చనిపోతే మనిషినైతే తీసుకురాలేము గాని వారి కుటుంబాన్ని ఆర్థికంగా కొంతైనా ఆదుకోగలం అనేది జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి, కొణిదెల పవన్ కళ్యాణ్ నినాదం ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్ బాబు కొనియాడారు. జనసేన పార్టీ చేపట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వం అనేది ప్రజలకు చాలా ఉపయోగకరమైనది. ఈ సభ్యత్వము సంవత్సరానికి ఒకసారి 500 రూపాయలతో చేసుకోవాలి, యాక్సిడెంట్గా వ్యక్తి మరణిస్తే ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందుతుంది. ఈ సభ్యత్వ కార్యక్రమం జూలై 18 వ తారీకు నుంచి 28వ తారీకు వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.