Saturday, December 13, 2025


జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవికి సమస్యలు తెలిపిన పరిటాల రైతులు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:

కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రైతులు గత కొన్ని సంవత్సరాలుగా క్రషర్లు, క్వారీల వలన పడుతున్న ఇబ్బందులు వారి సమస్యలను తెలుసుకున్న నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి…

క్రషర్లు, క్వారీల వల్ల 1400 ఎకరాల సాగు చేసే రైతులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారని పంట కూడా పండించుకొలేని స్థితిలో…మా పొలాలు అలాగే అమ్ముకో లేని స్థితిలో ఉన్నామని ముందు చూస్తే నుయ్యి  వెనక చూస్తే గొయ్యి అనే సామెతల రైతుల యొక్క బాధలు ఉన్నాయని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త తంబళ్ళపల్లి రమాదేవి తెలిపారు…

ఈ క్రషర్స్ లలో వైసీపీకి చెందిన బినామీలే ఉన్నారని వెల్లడించారు…

త్వరలో పూర్తి ఆధారాలతో సమాచారంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రైతులతో సహా కలుస్తామని రైతుల బాధను ఆయనకి వివరిస్తామని జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పేర్కొన్నారు. అనంతరం వీరులపాడు మండలం దాచవరం గ్రామంలో రావుల వెంకటేశ్వరావు కుటుంబాన్ని, కంచికచర్ల పట్టణంలో దేవిరెడ్డి నాగరాజు కుటుంబాన్ని, తాటి ఠాగూర్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular