కొండపల్లి మున్సిపాలిటీ : ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా జనసేన పార్టీ సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో భాగంగా కొండపల్లికి చెందిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్, మరికొంత మంది కార్యకర్తలు చలో అసెంబ్లీకి వెళ్లకుండా ఆదివారం రాత్రి 9 గంటలు నుంచి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనంతరం బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీకాంత్ తో పాటు మరికొంత మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ అరెస్టు
RELATED ARTICLES