ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో గల స్థానిక శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో ప్రిన్సిపాల్ కొనకంచి లావణ్య వారి ఆధ్వర్యంలో సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా విధ్యార్ధులు తాము చార్టుల తో తయారుచేసిన ప్రోజెక్ట్ లను ప్రదర్శించారు.
జగ్గయ్యపేట యం.ఈ. ఓ. చిట్టిబాబు వారు విధ్యార్ధుల ప్రతిభను చూసి అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కొనకంచి లావణ్య మాట్లాడుతూ “మనిషిని చీకట్లో నుండి వెలుగులోకి తీసుకెళ్ళే సాధనమే సైన్స్ ” అంటూ సైన్స్ యొక్క గొప్పతనాన్ని విధ్యార్ధులకు తెలియజేసి వైజ్ఞానిక శాస్త్రానికే వైధ్యుడైన సర్.సి.వి.రామన్ (చంద్రశేఖర వెంకట రామన్ ) యొక్క గొప్పతనాన్ని రామన్ ఎఫెక్ట్ సిధ్ధాంతాన్ని కనుగొన్న రోజుని (ఫిబ్రవరి – 28 ) ” సైన్స్ డే ” గా జరుపుకుంటారని విధ్యార్ధులకు తెలియజేశారు.
ప్రాజెక్ట్ చార్ట్స్ ప్రదర్శించిన విధ్యార్ధులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి ఫిజిక్స్ లెక్చరర్ హనుమంతురావు, కెమిస్ట్రీ లెక్చరర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విధ్యార్ధులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎజీయం. మురళీకృష్ణ , ఆర్.ఐ.టి., వినోద్, డీన్.వి., కృష్ణ , ప్రైమరీ – ఇన్చార్జ్ ఝాన్సీ , ప్రీ – ప్రైమరీ ఇన్చార్జ్ లిల్లీ రెడ్డి , ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విధ్యార్ధినీ విధ్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట శ్రీ చైతన్య పాఠశాల లో ఘనంగా సైన్స్ డే వేడుకలు
RELATED ARTICLES