ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డులో అక్రమ నిర్మాణం…
తన స్థలంలో మున్సిపల్ వారు రోడ్డు వేసారని స్థల యజమాని ఆరోపణ…
రోడ్డులో మాదే స్థలం అంటూ యజమాని కొనసాగించిన నిర్మాణం ….
జగ్గయ్యపేట పట్టణంలో కోదాడ రోడ్డులో జాగృతి అపార్ట్మెంట్ వెనుక భాగన గత కొన్ని నెలలుగా మున్సిపల్ వారు వేసిన సిమెంట్ రోడ్డు పంచాయతీ తారాస్థాయికి చేరింది.జగ్గయ్యపేట మున్సిపల్ అధికారులు మాత్రం ఇప్పటికే శివారు ప్రాంతాలల్లో లే అవుట్ లేకుండా ప్లాట్లు పెట్టి అమ్ముతున్న మున్సిపాలిటీ వారు పట్టించుకోకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తి ప్రజలకు అసౌకర్యానికి కారకులౌతున్నారు.జాగృతి అపార్ట్ మెంట్ వెనుక భాగాన రోడ్డు కి అడ్డంగా నాది అని స్థల యజమాని నిర్మాణం కొనసాగిస్తుంటే విషయాన్ని కొందరు మున్సిపల్ కమిషనర్ కి సమాచారం ఇచ్చిన అధికారులు పట్టించుకోకపోవడం తో రోడ్డు లో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి వాస్తవాలను తేల్చి రోడ్డు లో అక్రమ నిర్మాణం పై తగు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
జగ్గయ్యపేట మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డులో అక్రమ నిర్మాణం
RELATED ARTICLES