జగ్గయ్యపేట :
గ్రీవెన్స్ లో చేసిన ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ సప్లయిస్ ఆఫీసర్ చల్లా లక్ష్మీ నారాయణ రెడ్డి,అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ యన్.యు భాను ప్రసాద్ గార్లు జగ్గయ్యపేట,చిల్లకల్లు,షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు లోని పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు బంకులలో వినియోగదారుల విజ్ఞప్తి మేరకు అదునాతన టెక్నాలజీ ని ఉపయోగించుకోవాలని,ప్రతి బంకులో ఉచిత గాలి మెషన్లను వినియోగంలోకి తీసుకుని రావాలని, టాయిలెట్స్,మరుగు దొడ్లను అందుబాటులో ఉంచాలని,ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారులకు పెట్రోల్ బంకుల అందించాల్సిన ఉచిత సేవల బోర్డులను ప్రతి బంకులో ఏర్పాటు చేయాలని వారు తెలియజేశారు.ఫిర్యాదులోని అంశాలను అధికారులు తనిఖీ చేయడం జరిగింది.మరొక మారు పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీలు చేస్తామని వారు అన్నారు.
జగ్గయ్యపేటలో పెట్రోల్ బంకుల తనిఖీలు
RELATED ARTICLES