TEJA NEWS TV:
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం లో ప్రజలకు రక్షణ కరువైందని,ఎక్కడ చూసినా భౌతిక దాడులు, హత్యలు,అత్యాచారాలు ఎక్కువైపోయాయని శ్రీశైలం తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పస్పిల్ మున్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పత్తికొండలో ఆంధ్రజ్యోతి విలేకరి పై వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తున్నామన్నారు. నిజాలను నిర్భయంగా రాసే విలేకరులపై దాడి చేయడం చేతకానితనానికి నిదర్శనం అన్నారు.సమాజంలో జరుగుతున్న విషయాల్ని ప్రజలకు చేరవేయ్యడం పత్రిక ధర్మం అని, అలాంటి వారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పత్తికొండలో కీచక ఉపాధ్యాయుడు పై వార్త రాస్తే వైసీపీ నాయకులు కీచక ఉపద్యాయుడిని వత్తాసు పలకడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న, హత్యలు జరుగుతున్న జగన్ రెడ్డి స్పందించకపోవడం చాలా బాధాకరం అన్నారు, విలేకరుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారి రక్షణకు అన్ని విధాలుగా సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్, ఉస్మాన్, రాజు పాల్గొన్నారు
జగన్ రెడ్డి ప్రభుత్వంలో పాత్రికేయులకు రక్షణ కరువు : శ్రీశైలం నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పస్పిల్ మున్నా
RELATED ARTICLES