Tuesday, June 17, 2025

జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు ప్లాట్లు అమ్ముకున్నారు

TEJA NEWS TV
– బుచ్చిరెడ్డిపాలెం సమగ్రాభివృద్దే నా ధ్యేయం.
– సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం.
– ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ అమలు చేస్తాం.
– స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
అస్తవ్యస్తమైన విధాలతో విధానాలతో గత పాలకులు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలోని 7, 8, 9 వార్డులలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా ఆమె ఇల్లిలూ తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల  పరిష్కారానికి కృషి చేయాలని ఆమె స్థానిక ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరుతో జరిగిన అవకతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలలో సామాన్యులకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా వైసిపి నేతలే అమ్ముకున్నారని ఆరోపించారు. కోవూరు నియోజకవర్గం లో అనారోగ్య పీడితులకు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందజేసి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. ఈనెల 12 న తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆగస్టు నాటికి మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు అమలు చేయనున్నారు అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రకటించారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణ సమగ్రాభివృద్దే తన ధ్యేయమన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞులు కాబట్టి ఖాళీ ఖజానాతో అధికారం చేపట్టిన ప్రజలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని ఆమె ప్రశంసించారు. వెన్నుపోటు దినం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేతలే వీదికక్కడం  హాస్యాస్పదంగా ఉందని ఆమె వైసీపీ నేతలను ఎద్దేవా  చేశారు.ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ కమిషనర్ బాలకృష్ణ, ఎంపీడీవో శ్రీహరి, మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, నశ్రీన్ ఖాన్, కౌన్సిలర్లు షేక్ రహమత్, తాళ్ల వైష్ణవి, పుట్ట లక్ష్మీకాంతమ్మ, శ్రీదేవిలతో పాటు టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, టిడిపి నాయకులు బత్తలహరికృష్ణ, షేక్ పర్వీన్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular