TEJA NEWS TV : ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా | 19-09-2025: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు కలిసి “ఛలో మెడికల్ కాలేజ్” పేరుతో నంద్యాల మెడికల్ కాలేజీ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు పర్మీషన్ కోరిన విషయం తెలిసిందే.
అయితే, నంద్యాల జిల్లా పోలీసు శాఖ ప్రకారం, అదే తేదీ ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు 30-09-2025 వరకు కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆందోళన కార్యక్రమం పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున, ఏ విధమైన సమావేశాలకు అనుమతి ఇవ్వబడదని డీఎస్పీ కార్యాలయం ప్రకటించింది. అలాగే, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, పోలీస్ చట్టం సెక్షన్ 30 అమలులో ఉన్నందున గుంపులు, ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు.
నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కార్యాలయం, ఆళ్లగడ్డ స్పష్టం చేసింది.
ఛలో మెడికల్ కాలేజ్” కార్యక్రమానికి అనుమతి లేదు—పరీక్షల నేపథ్యంలో పోలీసుల స్పష్టత
RELATED ARTICLES



