TEJA NEWS TV
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం పట్టణంలోని ఆదర్శ నగర్,జగదీశ్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి చోరీకి పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై సంజీవరావు వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ నిందితులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి, ఆయా ఇండ్ల తాళాలను పగలగొట్టి చోరీకి పాల్పడుతున్నట్టుగా వెల్లడించారు. వారు మాలోత్ విక్రమ్, వేములవాడ జీవన్ ప్రకాష్ లుగ గుర్తించి అరెస్టు చేసినట్టుగా వెల్లడించారు. భద్రాచలం పట్టణంలో తాళం వేసివున్న ఇళ్లను ఎంచుకొని రాత్రి సమయంలో దొంగతనం చేసి వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారిగా విచారణలో తేలిందన్నారు. నిందితుల వద్ద నుండి సుమారుగా ఎనిమిది తులాలు బంగారం, ఇరవై తులాల వెండి, ఒక సెల్ఫోన్ను స్వాదీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన మాలోత్ విక్రమ్ పై గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోను పలు దొంగతనం కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలియజేశారు. ఇరువురు ముద్దాయిలును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు వెల్లడించారు.