Tuesday, June 17, 2025

చైతన్య కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

యన్టీఆర్ జిల్ల నందిగామ

TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట లో గల చైతన్య కళాశాల లో ఆదివారం 1997 –  1999  బ్యాచ్ చైతన్య కళాశాల ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది

ఈ సందర్భంగా చైతన్య కళాశాల చైర్మన్ దంపతులు అమరనేని రమేష్ జ్యోతి వారిని పూర్వ విద్యార్థులు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరు తమ కాలేజీ రోజుల లో జరిగిన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకొని సందడి చేశారు.

పూర్వ విద్యార్థులు తాము ఏ ప్రాంతాలలో నివసిస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, కుటుంబం లో పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు తదితర విషయాల గురించి ఒకరినొకరు తమ అనుభవాలను తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమం లో లెక్చరర్ తాటి రామకృష్ణ ,  క్లర్క్ రామకృష్ణ , పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular