మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో, పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీపీ, మాసుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, వీరు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ,బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని వారు, పేర్కొన్నారు ఈ సందర్భంగా రజాక సోదరులతో కలిసి చేగుంట లోని, చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి కేక్ కట్ చేశారు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు మట్టిలోనే ఐలమ్మ జీవితమే నిదర్శనముగా నిలిచిందన్నారు
ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, అధ్యక్షుడుశంకర్, ఉపాధ్యక్షుడు యాదగిరి, కోశాధికారి రవి, డిష్ రాజు, వల్ప మహేష్, మేకల సతీష్, షాదుల్లా, అంజి, శరత్, సాయిబాబా, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు,
చేగుంట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
RELATED ARTICLES