మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట్ గ్రామానికి చెందిన అచంపేట్ మహేష్ (26)నిన్న గ్రామం లో ఉన్న దేవుని చెరువులో నిన్న మధ్యాహ్నం స్నానం చేసేందుకు వెళ్లి కాలుజారి మునిగిపోయాడు, గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా నేడు శవం లభించింది, తండ్రి అచ్చంపేట వెంకటేష్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.