Teja news tv
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు ఉన్న ఉర్దూ పాఠశాల నందు చదువుతున్న 50 మంది పేద విద్యార్థులకు పలక,నోటుబుక్కు, పెన్సిల్ పలు రకాల చదువుకు ఉపయోగించే వస్తువులను షేమిమ్ బేగం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు చదువుకొనుటకు ఉపయోగించే వస్తువులను ఈరోజు పంపిణీ చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు చదువుకోని మంచి ఉద్యోగాలలో నైపుణ్యతను ప్రదర్శించేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షబానా,మాధవి,నూరు మహమ్మద్ భి,పాఠశాల ఉపాధ్యాయులు,పిల్లలు పాల్గొన్నారు.
