Saturday, December 13, 2025

చిరు వ్యాపారుల అభివృద్ధికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూత

తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం


సంగెం మండలంలోని సంగెం మరియు మొండ్రాయి గ్రామాల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల అభివృద్ధి కోసం టిఫిన్ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. సంగెం గ్రామంలో శంకర్ టిఫిన్ సెంటర్ మరియు మొండ్రాయిలో ఎండి సైఫుద్దీన్ టిఫిన్ సెంటర్‌లను *ముఖ్య అతిథి ఎర్రబెల్లి* *వినీత్ రావు * ప్రారంభించారు. ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తూ, గ్రామీణ స్థాయిలో చిన్న వ్యాపారులు ఎదగడానికి అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో *బీజేపీ సంగెం మండల అధ్యక్షులు దామెరుపుల* *చంద్రమౌళి గారు* , మాజీ ఎంపీపీ కందకట్ల నరహరి, మాజీ సర్పంచ్  అన్నమనేని సంతోష్ రావు మాజీ ఎంఫీటీసీ యాదగిరిరావు, గీసుకొండ మండల అధ్యక్షులు కొంగర రవికుమార్, సంగెం మాజీ సర్పంచ్ గుండేటి బాబు సంగెం మాజీ ఎంపీటీసీ వీరస్వామి పులి, జక్క చేరాలు, 15వ డివిజన్ అధ్యక్షులు లాదల ప్రభాకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular