TEJA NEWS TV :
సంగెం మండల తేజ న్యూస్ టివి, ప్రతినిధి.
హైదరాబాదులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
టిపిసిసి పిలుపుమేరకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశానికి పరకాల శాసనసభ్యులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో గురువారం పరకాల నియోజకవర్గ పరిధిలోని పరకాల పట్టణం మరియు అన్ని మండలాలు, డివిజన్ల నుండి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.
పరకాల మండలం, టౌన్ మరియు నడికూడా మండలం నుంచి వచ్చిన నాయకులు పరకాల పట్టణంలోని అంగడి మైదానం నుండి బస్సులలో బయలుదేరగా దామెర ఆత్మకూర్ గీసుకొండ సంగెం మండల కేంద్రాల నుండి ఆయా మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు15,16,17 డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రెకుంట క్రాస్ నుండి ఆర్టీసీ బస్సులలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఆయా మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ జెండా ఊపి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై కాంగ్రెస్ జై జై రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్ కు వారు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు.
చలో హైదరాబాద్ బారి ఎత్తున తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
RELATED ARTICLES