భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలోని SS గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో భారతీయ యువ సేవ సంఘ్ ఆధ్వర్యంలో 5,000 మందితో అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు భరణి బాలకృష్ణన్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రోషన్ గుప్తా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ స్టేట్ ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు గారు నిర్వహించారు.
ముఖ్య అతిథులు:
అడ్వకేట్ డా. సౌరవ్ దాస్ (నేషనల్ జనరల్ సెక్రటరీ)
చావ్ల గారు (నేషనల్ సెక్రటరీ)
ప్రభాకర్ గారు (ఏపీ స్టేట్ ప్రెసిడెంట్)
ప్రశాంత్ గడిపే గారు (సౌత్ ఇండియా లీగల్ అడ్వైజర్)
అలాగే, నాలీ మధుసూదన్ యాదవ్, పలగాని శ్రీనివాసరావు గౌడ్, గూడూరు లక్ష్మీనారాయణ, ఎండి రంజాన్ అలీ, రాజులపాటి ఐలయ్యతో పాటు లక్నో, వెస్ట్ బెంగాల్, న్యూ ఢిల్లీ నుంచి BYSS ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన 5,000 మంది యువతీ యువకులతో సభ విజయవంతమైంది.
ఈ సందర్భంగా నేషనల్ జనరల్ సెక్రటరీ అధికారికంగా మద్దిశెట్టి సామేలు గారిని BYSS జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.
చలో ఇల్లెందు విజయవంతం – మద్దిశెట్టి సామేలు జాతీయ యువ మోర్చా అధ్యక్షులు
RELATED ARTICLES



