రుద్రవరం మండల కేంద్రంలోని అమ్మవారి శాల సెంటర్ సమీపంలో ఏపీ దళిత సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు బుట్టి హుస్సేన్ గుర్రప్ప మరియు ఏపీ దళిత సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లె పోగు నరసింహులు గురువారం నాడు 22 వ ఆవిర్భావ వార్షికోత్సవ సభ అనంతపురంలో జరగబోవు సందర్బంగా కరపత్రాలను రిలీజ్ చేయడము జరిగినది. అనంతరము వారు మాట్లాడుతూ 25 ఆగస్టు ఆదివారం అనంతపురంలోనీ లలిత కళాపరిషత్తు సప్తగిరి సర్కిల్ నందు ఉదయం 10 గంటలకు సభ జరుగుతుందని,నంద్యాల జిల్లాలోని అన్ని గ్రామాల నుండి దళిత సమాఖ్య కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత సమాఖ్య కార్యకర్తలు బుట్టి పెద్ద దస్తగిరి బుట్టి చిన్న దస్తగిరి మబ్బు ఓబులేసు తదితరులు పాల్గొనడం జరిగినది.
చలో అనంతపురం ఏపీ దళిత సమాఖ్య 22వ మహాసభలు
RELATED ARTICLES