Monday, January 20, 2025

చర్ల :ఏజెన్సీలో గుడిసెలు క్రింద పాఠ్యాంశాల బోధన…బిల్డింగ్ నిర్మించాలని వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
*చర్ల మండలం*
01-11-2024

ఏజెన్సీలో గుడిసెలు క్రింద పాఠ్యాంశాల బోధన
బిల్డింగ్ నిర్మించాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎం డి ఓ, ఎమ్మార్వో ,ఎంఈఓ, అధికారులకు వినతి పత్రం అందజేత



పూర్తిగా ఏజెన్సీ మండలమైన చర్లలో నాలుగు పంచాయతీలు బక్క చింతల పాడు, రామచంద్రాపురం, కిష్టారం పాడు,  కొర్కట్పాడు, గ్రామాలలో పాఠశాలలు ఉన్నప్పటికీ అవి గుడిసెలకే పరిమితమైనవీ తప్పితే బిల్డింగులు లేవని టీచర్లు కూడా అరె కోరగా ఉన్నారని బిల్డింగులు నిర్మించాలని కోరుతూ ఎమ్మార్వో, ఎండిఓ, MEO,లకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.
అనంతరం *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, మాట్లాడుతూ* ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్బాల్ పలుకుతున్న ప్రభుత్వాలు ఎక్కడ అభివృద్ధి చేశాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిర్బంధ విద్య పేరుతో గ్రామాలలో విద్యాసంస్థలు నిర్మించి బిల్డింగులు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా ఎక్కడ పాఠాలు చెప్పుకోవాలో ఈ ప్రభుత్వాలు మాకు తెలియజేయాలని వారన్నారు. విద్యా రంగానికి వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పిన ప్రభుత్వాలు ఏజెన్సీలో ఎందుకు బిల్డింగులు కట్టలేకపోయిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీలో విద్య ఆదివాసీలకు అందనివ్వకుండా చేయడంలో భాగమేనని వారు అన్నారు. వారు చదువుకుంటే వీరు చేసే దోపిడీ వ్యవస్థ చేస్తున్న నూతన చట్టాల వివరాలు తెలుస్తాయి కాబట్టి అవి తెలియకుండా ఉండటం కోసమే ఆదివాసి బిడ్డలకు విద్యను అందనీ ద్రాక్షలా మారుస్తున్నారు. అరవకోరా సౌకర్యాలతో ఏజెన్సీలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. పేరుకే పాఠశాల అయినప్పటికీ అది పాకాలయంగా బోధన జరుగుతుందని వారు అన్నారు. తక్షణమే ఏజెన్సీలో కాంక్రీట్ భవనాలు నెలకొల్పాలని లేనిచోదసలవారిగా ఆందోళన చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొందు ముయన్న, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular