Friday, December 12, 2025

చరిత్రను మార్చే శక్తి – వ్యక్తి,ఆలోచనల్లోనే ఉంది – జిల్లా అధ్యక్షులు డా.బట్టు విఠల్ ముదిరాజ్

TEJANEWSTV TELANGANA:
చరిత్రను మార్చే శక్తి – వ్యక్తి, ఆలోచనల్లో నే ఉందిని జిల్లా అధ్యక్షులు.డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు.
*మనిషి“ఆలోచనలు,ఎప్పటికప్పుడు ఉన్నతం గా దృఢంగా, విశాల దృక్పథం తో చేయకపోతే, అవి,చనిపోతాయిని..అన్నారు* *ఆలోచనలు చనిపోతే చరిత్ర మరణిస్తుంది. చరిత్ర మరణిస్తే సమాజం కూడా  నశిస్తుంది అని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ పేర్కొన్నారు*

*మన సమాజం లో పెద్ద భ్రమ ఉంది… మార్పు అంటేఎప్పుడో .. ఎవరో..నాయకుడు వచ్చి చేస్తాడని అంటారు.. కానీ నిజమైన మార్పు మొదలయ్యేది వ్యక్తి,ఆలోచనలతోనే.* అనే నిజాన్ని తెలుసు కోరని ఆయన జంగంపల్లి గ్రామంలో జరిగిన గువ్వ బుచ్చయ్య ముదిరాజ్,సంతాప సభలో, మాట్లాడుతూ అన్నారు. జంగంపల్లి గ్రామానికి , ముదిరాజ్ జాతి కి , కామారెడ్డి జిల్లా ప్రజలకు ఆయన చేసిన సేవలు..  అందించిన స్పూర్తి యువత కు ఆదర్శనం అన్నారు. సంస్కృతి,సంస్కరణలు రెండు అవసరమే అని  భుచ్చన్న,ముదిరాజ్ ఎంతో కృషి చేశారనీ విఠల్ ముదిరాజ్ అన్నారు, భుచ్చన్న ముదిరాజ్  జీవిత ఆశయాలను  కొనసాగించాలని  కోరారు.
*మానవుడు ఆలోచన చేయక పోతే, జీవించడ మే వృథా..అని ఎందుకంటే ఆలోచనలు మానవుణ్ణి నూతన భవిష్యత్ వైపు  మల్లిస్తాయనీ వివరించారు. కాలానుగుణంగామారిన,ఆలోచనలు హేతువాద భావాలు.. చరిత్ర గతిని మార్చు తాయన్నారు. మారిన చరిత్ర” సమాజాన్నీమారుస్తుంది అని డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు.*
*మహనీయులు చెప్పినట్లుగా : మన“ఆలోచనలు,ఎప్పటికప్పుడు దృఢంగా చేయకపోతే, అవి,చనిపోతాయి. ఆలోచనలు చనిపోతే చరిత్ర మరణిస్తుంది. చరిత్ర మరణిస్తే సమాజం కూడా  నశిస్తుంది. ఇది కేవలం మాట కాదు, ఒక విప్లవ..దిశానిర్దేశం.మన ఆలోచనలే మన శక్తి,మన చైతన్యం, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు.*  ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా బార్.అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ ముదిరాజ్ , బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గొల్లపల్లి అంజయ్య ముదిరాజ్, గ్రామ అధ్యక్షులు, మాజీ గ్రామ అధ్యక్షులు, 4 సంఘాల అధ్యక్షులు గ్రామ పెద్దలు, రమేష్ ముదిరాజ్ నర్సింలు ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు బిబిపేట్ మండల కు చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి కోరి నర్సింలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular