Tuesday, January 14, 2025

చమర్తి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

TEJA NEWS TV

కార్యకర్తల గుండెచప్పుడే నారా లోకేష్

ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం,భారీ సంఖ్యలో పాల్గొన్న యువత

మెగా రక్తదాన శిబిరం గ్రాండ్ సక్సెస్.

రాజంపేట న్యూస్

తేజ న్యూస్ రిపోర్టర్ దాస శేఖర్

*24.01.2023*
*పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం*
*రాజంపేట*

నేడు కార్యకర్తలకు సోదరుడిగా,స్నేహితుడిగా కుటుంబ సభ్యుడిగా,ఆపద్బాంధవుడిగా అండగా ఉంటూ అనునిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ యువకిశోరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి 41వ పుట్టినరోజు సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

*రాజంపేట టీడీపీ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం నందు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు దాదాపు 300 మందికి పైగా పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.

*అనంతరం టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి మన ప్రియతమ నేత నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

*ఈ కార్యక్రమంలో మాజీ టిడిపి జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమ కుమారి,రాజంపేట మండల పార్టీ అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్య నాయుడు,వీరబల్లి మండల పార్టీ అధ్యక్షుడు భాను గోపాల్ రాజు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు బాపనయ్య నాయుడు,పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు,కూచివారిపల్లె సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు, తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధి జగదాభి పాండురాజు,శవనవారి పల్లె సర్పంచ్ కోటయ్య నాయుడు,మట్లి సర్పంచ్ నాగార్జున ఆచారి, భూషణయ్య నాయుడు,బీసీ నాయకులు జయరామ్ యాదవ్,సీనియర్ నాయకులు అమరేశ్వర్ రాజు,వీరబల్లి తెలుగుత నాయకులు సాయిరాజ్, మేడికొండు వెంకటేష్,నాగినేని దివాకర్,యువ నాయకులు పరుశురాం నాయుడు, కుమారి శివారెడ్డి,ఒంటిమిట్ట హరినాథ్ రెడ్డి,మోదుగుల నరసింహులు, బొడిచర్ల శ్రీనివాసులు,పోలు బుచ్చయ్యగారి పల్లి గంగిరెడ్డి,మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్ రాజు, సీనియర్ నాయకులు జీ.విసుబ్బరాజు,యువ నాయకులు సూర్యనారాయణ రాజు,నాగేంద్ర తులసి, వినోద్ రెడ్డి,రామ్మోహన్ శంకర్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular