




నంద్యాల జిల్లా
15-06-2025
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆదేశాలమేరకు ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ గారి సూచనలతో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని మూడు పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పోలీస్ అధికారులు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి నేటి తెల్లవారుజామున నేర నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం CASO (కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్) ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది.
1. కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్ – కంపమల (ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం)
* అనధికార బెల్ట్ షాపుల నుండి 30 DPL bottles స్వాధీనం.
2. రుద్రవరం పోలీస్ స్టేషన్ – పెద్ద కంబలూరు గ్రామం
* సరైన పత్రాలు లేని 9 మోటార్ సైకిళ్ళు స్వాధీనం.
3. కొలిమిగుంట్ల పోలీస్ స్టేషన్ – తుమ్మలపెంట
* సరైన పత్రాలు లేని 11 మోటార్ సైకిళ్ళు స్వాధీనం.
అంతేకాకుండా, ఈ మూడు గ్రామాల్లో రౌడీ షీటర్లు మరియు అనుమానితులు, నేర చరిత్ర గల వారి నివాసాలలో తనిఖీలు నిర్వహించబడ్డాయి.
ప్రజల భద్రత కోసం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్లు చేపట్టబడ్డాయి.
అనంతరం కార్డెన్ అండ్ సర్చ్ చేసిన గ్రామాలలోని ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు మొదలగు వాటిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీస్ అధికారులు అవగాహన కల్పించడం జరిగింది.
సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం. ఆళ్లగడ్డ.