Sunday, January 18, 2026

చంద్రబాబు ష్యూరీటి మోసం గ్యారంటీ ని జయప్రదం చేయండి – వై. సీతారామిరెడ్డి

TEJA NEWS TV : మంత్రాలయం మండలంలోని అన్ని గ్రామాల్లో బాబు ష్యూరీటి మోసం గ్యారంటీ కార్యక్రమం ను నిర్వహించి జయప్రదం చేయాలని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి  అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన బాబు ష్యూరీటి మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ముందుగా వైస్సార్సీపీ మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి , వైస్సార్సీపీ మండల ఇన్ చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి , సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో పెద్దాయన కు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేరవేర్చలేనని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందని జరిగిన తీరును వైస్సార్సీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి , ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న  నేతృత్వంలో ప్రతి గడపకు వెళ్లి రీకాల్ చంద్రబాబు అనే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి లబ్ధిదారులకు అందిన పథకాలు, అందలేని పథకాలను వివరించాలన్నారు. అదే విధంగా నియోజకవర్గం లో రైతులకు అవసరమైన ఎరువులు సక్రమంగా పంపిణీ చేయకుండా రాజకీయం చేస్తున్నారని మా దృష్టికి ఇప్పటికే వచ్చిందని అయితే వెంటనే నేను మా సోదరుడు అధికారులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఇంకా ఇబ్బందులు పడుతుంటే మేమే నేరుగా వచ్చి ఎరువులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నిజంగా మీ అందరి ప్రేమ అనురాగాలతో మా తమ్ముడు వై. బాలనాగిరెడ్డి   నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడని ఇదే తరహాలోనే అందరూ కలిసి కట్టుగా ముందుకు వచ్చి రానున్న రోజుల్లో కూడా అత్యధిక మెజార్టీతో మా తమ్ముడు వై. బాలనాగిరెడ్డి ని, జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని మీ రుణం తీర్చుకో లేనిదని భావోధ్వేగానికి గురై కోరారు. అనంతరం పెద్దాయన కు పలువురు నాయకులు, కార్యకర్తలు శాలువ కప్పి, పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలం లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular